Oterra వెడ్డింగ్స్

మీ అద్భుత వివాహ కథను ది ఒటేరాలో రచించండి

మీ వేడుకను ది ఒటేరా ప్రపంచంలోకి తీసుకురండి. విలాసవంతమైన వెలుగులతో నిండిన వాతావరణం నేపథ్యంలో, మీ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా చేయండి. పెళ్లి, పుట్టినరోజు లేదా వార్షికోత్సవం ఏదైనా సరే, ఆ వేడుక కోసం మా ఇండోర్ బాంకెట్ ఆప్షన్లు, కోర్ట్‌యార్డ్, saucer లేదా poolside al fresco ఫంక్షన్ ఏరియాను ఎంచుకోండి. మిగిలిన విషయాలు మాకు విడిచిపెట్టండి. మీ పెళ్లి ఒక గోప్యమైన వేడుక అయినప్పటికీ, లేదా ఒక ఆడంబర వేడుక అయినప్పటికీ, మా టీమ్‌లు చేసే ఆకట్టుకునే అలంకరణ మరియు మా షెఫ్‌లు అందించే అతిగొప్ప రుచులతో మీ ప్రత్యేక సందర్భాన్ని చిరస్మరణీయం చేసుకోండి. .

చికాకులు లేని ఈవెంట్

ఫోటోగ్రాఫర్, ఫ్లవర్ ఎరేంజ్‌మెంట్స్, మెహందీ ఆర్టిస్ట్, బ్యూటీషియన్ లేదా DJ లాంటి ఏర్పాట్లలో మీకు సహాయం అందించడం ద్వారా, మీ రోజును అద్భుతంగా ప్లాన్ చేయడంలో మీ ఒత్తిడి తగ్గించడంలో మేము సహాయం అందిస్తాము.

అత్యద్భుతమైన సౌందర్యం

Grand Ballroom, Courtyard, Saucer, Poolside మరియు Lawnలతో ది ఒటెరాలోని విశాలమైన వివాహ వేదికలు మీ అన్ని రకాల అభిరుచులకు చక్కగా సరిపోతాయి.. ఆకట్టుకునే సౌందర్యం కోసం సాటిలేనివి .

ఫెస్టివ్ ఫీస్ట్

రుచికి మాత్రమే కాకుండా మనస్సుకు కూడా సంతృప్తి అందించే గొప్ప ఆహారం లేకుండా ఏ వేడుకా పూర్తి కాదు. అనుభవజ్ఞులైన మా షెఫ్‌లు మీ మనస్సు కోరుకునే ఎలాంటి విందు వంటకాలైనా సిద్ధం చేయగలరు. బెంగళూరులోని ఈ అత్యుత్తమ బాంకెట్ హాల్‌లో మీ అద్భుతమైన రోజును వేడుక చేసుకోండి. .